Pages

January 6, 2019

ఇంగ్లీష్ లో చాలా సహజం గా చేసే కొన్ని పొరబాట్లు....!

చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తాయి.నిజానికి ఇవి మనకి తెలిసినవే అయినా కొన్ని సార్లు ప్రతి రోజు వాడకపోవడం వల్ల రాయడం లో ను,మాటాడం లోను ఈ తప్పులు దొర్లుతుంటాయి.అలాంటివి ఇప్పుడు కొన్ని చూద్దాము. 

 Today morning,I woke up late. అని అనేస్తాము.అలవాటు లో పొరబాటు గా..!దీన్ని This morning ,  I woke up late అని అనాలి. అంటే ఎక్కడ దొర్లింది పొరబాటు this morning  అని అనాల్సినదాన్ని Today morning అని అన్నామన్నమాట.చాలా సింపుల్ మిస్టేక్ కదూ ..!

ఇంకోటి చూద్దాం..!

ఇది  ఆరు నెలల గల కోర్స్ అని చెప్పాలి.ఎలా చెపుతాము.  This is a six months course  అని రాస్తే పొరబాటు.మరి ఏమని రాయాలని అంటారా..?This is a six-month course అని చెప్పాలి.ఒక్క అక్షరం లో అంత తేడా ఉంది.ఇలాంటి చిన్న పొరబాట్లు ఒక్కోసారి ఎవరూ పట్టించుకోకపోవచ్చును.కాని తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు గదా ..! 

June 25, 2018

Jostle అనే పదాన్ని ఎలా ఉపయోగించవచ్చు..?

ఈ పదానికి అర్ధం తోసుకోవడం అని అర్ధం.ఉదాహరణకి రైల్ స్టేషన్ లోనో ఇంకెక్కడో బాగా జన సమ్మర్ధం ఉన్న చోటనో మనల్ని జనాలు నెట్టెయేడం లాంటిది జరుగుతూనే ఉంటుంది.కిందపడక పోవచ్చు కాని ఆ రష ని మనం అనుభవిస్తాం.I was jostled by the heavy rush at the Railway station అని చెప్పవచ్చు.ఇవాళ ఒక ఇంగ్లీష్ పేపర్ లో ఒక వ్యక్తి ఇలా చెప్పాడు.Locations were jostled with. అని.మేము అనేక లొకేషన్ లు చూశాము షూటింగ్ కోసం అనే అర్ధం లో చెప్పాడు.సాధ్యమైనంత దాకా ఇంగ్లీష్ వాక్యాల్ని మక్కీ కి మక్కీ గా కాక ఒక context లో చదివినపుడు ఏ విధంగా ఉపయోగించారా అని చూడాలి.

May 28, 2018

సాంకేతిక ఇబ్బంది ని ఈ పదం తో సూచించవచ్చు..!


సాంకేతిక ఇబ్బందులు గురించి చెప్పేటపుడు అనేక రకాల పదాలు వాడుతుంటాము.కంప్యూటర్ కావచ్చు,లిఫ్ట్ కావచ్చు,ఇంకా ఏదైనా కావచ్చు చెడిపోయింది.సాంకేతికంగా సమస్య ఉన్నది.ఆ స్థితి ని చెప్పాలి అనుకున్నప్పుడు glitches అనే పదం బాగా సహకరిస్తుంది.ఉదాహరణకి ఒకటి చెప్పుకుందాం. MY COMPUTER IS NOT WORKING WELL BECAUSE OF SOME TECHNICAL GLITCHES.ఇప్పుడు ఆ సెన్స్ అర్ధం అయింది గా.మీరు స్వంతం గా కొన్ని వాక్యాలు తయారు చేసి నోటి తో పలకండి.అప్పుడు గుర్తుండే అవకాశం ఎక్కువ గా ఉంటుంది.  

September 4, 2017

Artist కి Artiste కి మధ్య తేడా ఉంది...అదేమిటో తెలుసా..?


ఏ వ్యక్తి అయినా కళ కి సంబందించిన  వాటిని సృష్టిస్తున్నట్లయితే అలాంటి వారిని Artist గా పిలుస్తాము.ఉదాహరణకి Painter,Sculptor, Musician  ఈవిధంగా చెప్పవచ్చు.అదే విధంగా కళల్ని Perform చేసే వాళ్ళని Artiste అని చెపుతారు.ఉదాహరణకి Singer,Dancer, అలా చెప్పవచ్చు.ఒక్క e తో అంత బేధం ఉంది ,Artisan అని ఇంకో పదం ఉంది ...దీని అర్ధాన్ని మీరు తెలుసుకోడానికి యత్నించండి,లేదా ఇంకెప్పుడైనా చెప్పుకుందాము.

April 12, 2017

Vying దీన్ని ఏ సందర్భం లో ఉపయోగిస్తారు..?ఒక విషయం గురించి పోటీ పడటాన్ని ఈ పదం ఉపయోగించి చెప్పవచ్చును.ఉదా: Swimmers from many nations were vying for the title .

January 20, 2017

ఇవి చిన్నవే కాని తికమక పరచడం లో మా చెడ్డవి.

ఇవి చిన్నవే కాని తికమక పరచడం లో మా చెడ్డవి.అవి ఏమంటే i.e. ఇంకొకటి e.g., ఎక్కువ గా వాక్యం మధ్యలో వస్తుంటాయి.ఈ రెండూ కూడ లాటిన్ భాష నుంచి ఆంగ్లం లోకి వచ్చాయి.i.e. పూర్తి రూపం ఏమంటే id est అని. That is అని అర్ధము.

ఉదా . One group of people seems to be ignored ,i.e. pensionors,we are talking about.

 ఇక రెండవది  e.g.  దీని పూర్తి రూపము Exempli gratia  అని. For example అని అర్ధం.

ఉదా. Prohibition of illegal substances e.g. LSD and MDMA will be continued.

ఈ రెండిటిని  రాసేప్పుడు Lower case లోనే ఉండటం గమనించే ఉంటారు.

January 5, 2017

ఉదా. Disinterested ఇంకా Uninterested వీటి గురించి చూద్దాము.రెండిటికి పెద్ద తేడా ఏముంది లే అనుకుంటాము.

గతం లో కొన్ని పదాల గురుంచి చెప్పుకున్నాము.ఇప్పుడు ఇంకొన్ని వాటి గురించి చెప్పుకుందాము.ఒకేలాగే దగ్గర గా ఉంటాయి కాని అర్ధం లో చాలా భేదం కలిగి  తిక మక పెడుతుంటాయి.అలాంటివి కొన్ని చూద్దాము.

ఉదా.  Disinterested   ఇంకా  Uninterested వీటి గురించి చూద్దాము.రెండిటికి పెద్ద తేడా ఏముంది లే అనుకుంటాము.కాని తరచి చూసినట్లయితే చాలానే ఉన్నది.Disinterested అనే దాన్ని ఎటూ మొగ్గకుండా ,సైడ్స్ తీసుకోకుండా చెప్పేప్పుడు ఉపయోగించాలి.ఉదాహరణకి ఇద్దరు కొట్టుకుంటున్నారు, వారి ఇద్దరి లో ఎవరి పక్షమూ తీసుకోదలచలేదు.నాకు దానిలో ఆసక్తి లేదు అని అంటాము కదా అలాంటప్పుడు ఉపయోగిస్తాము..I am disinterested  ..అని చెప్పవచ్చు..అక్కడి సెన్స్ అర్ధమయింది గదా..!

ఇకపోతే  రెండవది..Uninterested ..మనకు ఒక విషయం లో ఇష్టం లేనప్పుడు ఉపయోగిస్తాము. ఉదాహరణకి The Movie is unintereted


ఇక Enormity  మరియు Enormousness  అనే పదాలు.

ముందు పదాన్ని నెగిటివ్ సెన్స్ లో చెప్పడానికి ఉపయోగిస్తాము.We understood the enormity of Tsunami ( అది ఎంత నాశని యో తెలుసు గదా )

ఇక Enourmousness  అనేది Large అనే అర్ధం లో వాడతాము.ఉదాహరణకి  They got enormous  profits ఇంకా   Enormousness of ocean surprises us ఇలా ఉపయోగిస్తూ ఉంటాము .


అలానే Bemused ఇంకా  Amused ఈ రెంటికి తేడా ఉన్నది.Bemused అనే దాన్ని కంఫ్యూజ్ కి గురయినపుడు వాడతాము.ఉదాహరణకి The story is completely bemused .సరదాగా ఉండే అర్ధం లో, వినోదాన్ని ఇచ్చే అర్ధం లో  Amused ని వాడతాము. ఉదాహరణకి  Their funny talks amused us ..బాగా చదువుతూ పోతుంటే ఏ Tone లో ఏ మాట వాడబడుతుందో అర్ధం అవుతుంది.
  

December 24, 2016

Set off అనే మాటని ఏ సందర్భం లో వాడుతారు..?


ఆ మాటకి అర్ధం ప్రారంభించడం (ప్రయాణం) అని చెప్పాలి.వాళ్ళిద్దరు ఆ కారు లో బయలు దేరారు ..దీని లో ఆ మాటని ఉపయోగిద్దాము.

They set off together, in a car..! 

August 28, 2016

"ఈ పాటికి వాళ్ళు అక్కడుండవలసింది" దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెబుతాము..?They could have been there by now అని చెప్పవచ్చు.మీకు మీరు కొన్ని స్వంతంగా తయారు చెసుకుంటే ఇంకా బాగా గుర్తుంటాయి.కనుక ప్రయత్నించండి.  

August 26, 2016

కారు తోలడానికి ముందు డ్రైవింగ్ లైసన్స్ పొంది ఉండాల్సింది దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పవచ్చు..?You should have obtained a driver's license before driving a car. అని చెప్పవచ్చు.Should have  ని ఎలా అర్ధవంతం గా ఉపయోగించవచ్చునో తెలిసింది కదూ..ఇలాగే మీరు ఇంకొన్ని ప్రయత్నించండి.